భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా.. ఓ విమానంలో అగ్నిప్రమాదం సంభవించి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటన బ్రెజిల్‌లోని గ్వారుల్హోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ320 విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

మరిన్ని కథనాలు:

Goa: గోవాలో ఘోర అగ్నిప్రమాదం..