భారత్ సమాచార్.నెట్: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రసంగించే సంగతి తెలిసిందే. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుంటారు. తాజాగా జరిగిన 124వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ఎపిసోడ్‌లో పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రత్యేకంగా వ్యోమగామి శుభాన్షు శుక్లా గురించి మాట్లాడారు.
అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా భూమికి చేరుకోగానే దేశమంతా గర్వపడిందన్నారు.…
