భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడిగా రూపొందుతున్న పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం అంచనాలను మరోసారి రూ.11,214.78 కోట్లకు పెంచుతూ సవరించారు. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన డ్యాంలో పరిశోధన, సర్వే, ప్రిపరేషన్ పనులు, డిజైన్లు, డ్రాయింగుల రూపకల్పన, ప్రధాన డ్యాం మొదటి రెండు భాగాల్లో రాతి, మట్టికట్ట నిర్మాణం, మూడో భాగంలో కాంక్రీటు డ్యాం నిర్మాణం, కాఫర్ డ్యాంల నిర్మాణం, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్,…


