భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: దయచేసి తన ఫొటోలను మార్ఫింగ్, ఎడిట్ చేయవద్దని ఎక్స్ ఏఐ ఫ్లాట్‌ఫామ్ గ్రోక్‌ను భారత మహిళా క్రికెటర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) కోరింది. ఇటీవల ఎక్స్‌వేదికగా ఫొటోలను ఎడిట్ చేయడం, మార్ఫ్ చేయడం ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని ఫొటోల నుంచి వ్యక్తులను తీసేయడం, డ్రెస్ కలర్స్‌ను మార్చడం వంటి పనులను నెటిజన్లు గ్రోక్ సాయంతో చేశారు. గత కొన్నిరోజులుగా ఎక్స్‌లో ఇది బాగా ట్రెండ్ అవుతుంది.
ఈ క్రమంలోనే తన ఫొటోలను మార్ఫింగ్, ఎడిట్ చేయవద్దని,…

