భార‌త్ స‌మాచార్.నెట్, వనపర్తి: జిల్లాలో గ్రామ పాలన అధికారుల‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లాలో ఏర్పాట్లు చేయాలని సిసిఎల్ ఉన్నతాధికారి లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో.. జిల్లాలో ఉన్న 228 గ్రామ పంచాయతీలలోని 133 క్లస్టర్లలో పరీక్ష రాసిన 135 మందిలో, 109 మంది అర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.…