భారత్ సమాచార్.నెట్, కర్నూలు: జిల్లాలోని అంబేద్కర్ గురుకుల బాల, బాలికల పాఠశాలల్లో నెలకొన్న ముఖ్య సమస్యలను బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) నాయకులు ఈరోజు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. బీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు జి. సామేలు, ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఆధ్వర్యంలో నాయకులు.. త్రాగునీటి లోపం, పనిచేయని సీసీ కెమెరాలు, మహిళా విద్యార్థుల భద్రతాభద్రత, పౌష్టికాహార లోపాలు వంటి సమస్యలను కలెక్టర్‌కు వివరించారు.

 

అలాగే, వంట మాస్టర్లు విద్యార్థులపై దాడి చేసిన ఘటనలపైనా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి,…