భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు స్వీకరించబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.