భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి వార్డులో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో నూతన విద్యుత్ 25కేవీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో విద్యుత్ మరమ్మతులో భాగంగా విద్యుత్ పోల్స్ ను పునఃరుద్దిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ రమణారెడ్డి, డీఈ రామేశ్వర్ స్వామి, ఏఈ రామ్ మూర్తి, వార్డు సభ్యులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.