భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట మండలం గంగాయిపల్లి గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై శివంపేట పోలీసులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా చట్టవిరుద్ధంగా పేకాట ఆడుతున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 11,230 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు ఇటిక్యాల రేవంత్ రెడ్డి, బానోత్ కాండ్యా, సత్యనారాయణ , ఎ. ప్రశాంత్. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ఐదుగురు నిందితులను సిబ్బంది చాకచక్యంగా…