భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భగవత్ రామానుజుల స్వామి తిరు నక్షత్ర వేడుకలు బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు తిరునహరి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో రామానుజ మండపంలో స్వామివారికి పంచామృత స్నపన కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం వేద పారాయణం, విశేష అలంకరణ, అష్టోత్తర పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కండ్లకుంట భిక్షమాచార్యులు భక్తులకు రామానుజుల విశిష్టతను, వారు సమాజానికి అందించిన సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో…

