భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : భారీ వర్షాలకు దెబ్బతిన్న ముక్త భూపతిపూర్ బ్రిడ్జ్, మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్ల మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ఇరిగేషన్ చెరువుతో పాటు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు.
ముఖ్యంగా నాలుగో వార్డులో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. వర్షాల వల్ల కలిగిన నష్టాలను అంచనా వేసి, పునరుద్ధరణ పనులను…





