భారత్ సమాచార్.నెట్, మెదక్ : వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మ గుడి సమీపంలో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ రాజు మాట్లాడుతూ.. వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు, పిల్లలు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు ముఖ్యమని తెలిపారు.
అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు. డ్రైవింగ్…





