భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సచివాలయం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాలతో రాష్ట్ర సచివాలయాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించింది. గత ప్రభుత్వంలోని గుర్తులు, నిర్మాణాలను డ్రోన్‌లతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. సచివాలయ భవనంపై, దాని పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను ఎగరవేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ ఆదేశాలను పటిష్టంగా అమలు చేసేందుకు సచివాలయం చుట్టూ సైన్…