భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు గుజరాత్ జెయింట్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైంది.
గాయం వల్లే దూరం..
యస్తిక భాటియా మోకాలి గాయంతో బాధపడుతున్నారు. ఇదే గాయం కారణంగా ఆమె ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు వన్డే ప్రపంచ కప్‌కు కూడా దూరమయ్యారు. ఆమె స్థానంలో భారత జట్టులోకి ఉమా…

