భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తోడు, నీడ లేక అనాథాశ్రమంలో పెరుగుతున్న బాలబాలికలపై మమకారంతో ఇనుగుర్తి పట్టణానికి చెందిన ప్రముఖ గాయని ఆడెపు హేమలత ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ మియాపూర్‌లోని ఓం సాయి పేద బాలికల, వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడి బాలబాలికలకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు అందజేశారు.

రాఖీ పౌర్ణమి పండుగ ప్రాముఖ్యతను బాలబాలికలకు వివరించిన హేమలత, అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత,…