భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: బాసర ఆర్జీయూకేటీలో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్‌ను సందర్శించి, వర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి సంబంధించిన విభాగాలు, మొత్తం విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న విద్యా విధానం, అధ్యాపకుల వివరాలు, వసతి సౌకర్యాలు, సదుపాయాలు, విద్యార్థులు సాధించిన విజయాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. క్యాంపస్ విద్యార్థులను ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీర్చిదిద్దాలని…
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులకు నైపుణ్యాత్మక విద్యా బోధన అందించాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా





