Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో స్మృతి మంధాన

భారత్ సమాచార్.నెట్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మొదటి స్థానంలో నిలిచింది. 2019 తర్వాత మళ్లీ ఆమె ఈ స్థాయికి చేరడం గమనార్హం. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్డ్ (Laura Wolvaardt) ఇటీవల 19 రేటింగ్ పాయింట్లను కోల్పోవడంతో స్మృతికి టాప్ ర్యాంక్ చేరుకోవడానికి అవకాశమొచ్చింది.
ప్రస్తుతం స్మృతి మంధాన 727 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.…
