భారత్ సమాచార్.నెట్, మెదక్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం’లో భాగంగా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ విద్యార్థులకు మట్టి పరీక్షలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ, విద్యాశాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉన్నత తరగతుల విద్యార్థులకు మట్టి నమూనాల సేకరించారు. భూసార పరీక్షల ప్రాముఖ్యత, పరీక్షా విధానంపై శాస్త్రవేత్తలు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు.

ఈ పథకం ద్వారా విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి మట్టి నమూనాలను సేకరించి, వాటిని పరీక్షించి ఫలితాలను రైతులకు అందజేయాల్సి…





