భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో గల పురాతనమైన ఆలయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి నవగ్రహ పూజ గణపతి పూజ శివాభిషేకం స్వామివారికి సింధూర లేపనం శ్రీరామ జయరామ తమలపాకుల హారం వేసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం రాజపురోహితులు హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం, శనివారం విశేష పూజలు జరుగుతాయని, సాయంకాలం భజన కార్యక్రమాలు ఉంటాయని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని…