భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని వైస్సార్సీపీ మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని 52 బసాపురం గ్రామంలో రాంపురం శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు నిర్వహించారు. ముందుగా ఆర్గనైజర్ నాగరాజు, కురువ నాగరాజు ఆధ్వర్యంలో క్రీడాకారులు జి. భీమారెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం…