భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తమిళనాడు హోసూరులో చోటుచేసుకున్న సంఘటన ఒక్కసారిగా సంచలనం రేపింది. ఓ ప్రముఖ కంపెనీ నిర్వహిస్తున్న మహిళా హాస్టల్‌లోని వాష్రూమ్స్‌లో గుప్తంగా స్పై కెమెరాలు అమర్చిన ఘటన బయటపడింది. ఈ ఘోరానికి నిందితురాలు హాస్టల్‌లో పనిచేస్తున్న మహిళగా పోలీసులు గుర్తించారు.

 

ఆమె బాత్రూమ్‌లలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మహిళల వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపినట్లు విచారణలో వెల్లడైంది. ఆ వ్యక్తి ఆ వీడియోలను పోర్న్ వెబ్‌సైట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ విషయం బయటపడిన వెంటనే వందలాది యువతులు…