భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో మానవత్వానికి, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండపల్లి శ్రీనివాసరావు ముదిరాజ్ కాలనీ వాసులు సులభంగా రాకపోకలు సాగించేలా తన సొంత భూమిలోని మూడు గుంటలను దారి కోసం విరాళంగా అందించారు. సర్వే నంబర్ 327/2/2లో ఉన్న భూమికి సంబంధించిన పత్రాలను నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ సమక్షంలో అధికారులకు అందజేశారు. ఈ నిర్ణయం గ్రామంలో హర్షాతిరేకాన్ని కలిగించింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచి చిర్ర…





