భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్లు,…





