భారత్ సమాచార్, (నెల్లికుదురు) మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ లలో ఏర్పాటు చేస్తున్న సమ్మర్ క్యాంపులతో విద్యార్థులలోని ప్రతిభ మరింత పెంపొందుతుందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ కు ధీటుగా ప్రభుత్వ విద్యా రంగం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తన కోరిక మేరకు నెల్లికుదురులో సకల సౌకర్యాలతో పబ్లిక్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను…