భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప మద్దతు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతితో కలిసి వారు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ.. ఆదోని డివిజన్‌లోని ఐదు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నేతలు కలిసి వస్తే, వారందరినీ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే బాధ్యత తనదేనన్నారు.…