భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాలో ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు. యుఎస్పీసీ భాగస్వామ్య సంఘాలైన యుటిఎఫ్, టిపిటిఎఫ్, డిటిఎఫ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ చందా నరేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలని కోరారు.
మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యారంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో…





