భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మద్దికేర మండలం పెరవలి గ్రామంలోని శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామి వారి ఆలయంలో జరిగిన బహిరంగ వేలం పాటల్లో ఈసారి రూ,8,11,000 అదనపు ఆదాయం వచ్చిందని కార్యనిర్వాహణాధికారి రెబ్బా వీరయ్య తెలిపారు. టెంకాయలు, తమలపాకులు, తలనీలాలు, స్వామివారి ఫోటోల విక్రయ హక్కుల కోసం ఈ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో ప్రొద్దుటూరుకు చెందిన వెంకటరమణ రూ.9 లక్షలకు, గుంతకల్‌కు చెందిన చక్రిధర్ రూ.1.60 లక్షలకు, ఆంజనేయులు రూ.1.58 లక్షలకు వేలాలను కైవసం చేసుకున్నారు.…