భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆలూరు జేఏసీ, ఎమ్మార్పీఎస్ నాయకులు కత్తి రామాంజినేయులు, భూపేష్, ఎల్లప్ప, చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆలూరు బస్టాండ్‌లో చేపట్టిన ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆదోని జిల్లా ఏర్పడితేనే అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఆలూరు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, పాలనా సౌలభ్యం పెరుగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ దీక్షలకు వాల్మీకి బోయ పోరాట సమితి రాష్ట్ర…