భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలు, తండాలలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ నేతృత్వంలో, వేద పండితులు సంపత్ కుమారాచార్యుల మంత్రోచ్ఛారణల మధ్య రాములోరి పరిణయ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా కాస్య తండాలో సర్పంచ్ బోడ నర్సింహ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించి, భక్తులకు మహాన్న ప్రసాద వితరణ చేశారు. ఈ వేడుకల్లో ఉపసర్పంచులు,…