భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో శనివారం కాట్రియాల ప్రీమియర్ లీగ్ సీజన్-3 క్రికెట్ పోటీలను స్థానిక సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా విన్నర్ కప్ ఆవిష్కరణ చేసిన అనంతరం క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీర దారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతిరోజు క్రీడలు ఆడాలని యువతకు సూచించారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని…
కాట్రియాల క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం





