భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలోని దేవినగర్ వాసులు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం సమీప ఫ్యాక్టరీల నుంచి విడుదలైన నల్లని వ్యర్థ ధూళి గాలి ద్వారా ఇళ్లలోకి చొరబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాతావరణంలో ఉత్పన్నమైన ఈ కాలుష్యం ప్రాణాలకు ముప్పు కలిగించనున్నందున, బాధితులు వెంటనే సంబంధిత ఫ్యాక్టరీలకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు, వర్గాలను డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి భద్రతా చర్యలు, పరిశీలనలు మరింత గణనీయంగా చేపట్టాలని వారు కోరారు. స్థానికులు,…