భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు పాలకులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ దేవేందర్ డిమాండ్ చేశారు. రామాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు అన్ని రంగాల్లో మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మలిదశ ఉద్యమ సమయంలో యువకులు, నిరుద్యోగులు,…