భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటోంది. అరుణ్ జైట్లీ స్టేడియం, తెలంగాణ భవన్, ఇండియా గేట్ వంటి కీలక ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా రామ్ చరణ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీని సందర్శించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాటకు…