భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పనుల నిమిత్తం నడుస్తున్న కాంట్రాక్టర్ టిప్పర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్ల పంట పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి, లైవ్ కరెంట్ వైర్లతో సహా వ్యవసాయ రైతు పొలంలో పడిపోయింది. పోలుకు విద్యుత్ సరఫరా కొనసాగుతుండడంతో క్షణాల పాటు రైతులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో పొలంలో…