భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నేటి తరం యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్‌చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటు చేసిన పీపీఆర్ వాలీబాల్ టోర్నమెంట్‌ను శనివారం ఉదయం ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు. నేటి ఆధునిక జీవనశైలిలో యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడా…