భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరోసారి భారీ సినిమా సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ పాన్‌ఇండియా స్థాయి చిత్రంలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ అనుకున్నదానికంటే ముందే పూర్తయ్యే అవకాశం ఉండటంతో, తర్వాతి ప్రాజెక్ట్‌పై పనులు వేగంగా జరుపుతున్నారు.

 

ఇప్పటికే బోయపాటి శ్రీనుతో కథా చర్చలు జరిగినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన “సరైనోడు” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.…