భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పండుగలా సాగుతున్నాయి. టీ, టిఫిన్లు, బీరు, బిర్యానీ అన్నట్టుగా వ్యవహరం నడుస్తోంది. పార్టీ కార్యకర్తలైతే ఎలాగూ పార్టీ ప్రచారంలో పాల్గొంటారు. కానీ ప్రచార పర్వానికి జనసమీకరణలో తమ స్టామినా చాటుకునేందుకు అభ్యర్థులకు చుక్కలు కనపడ్తున్నాయి. ఏ పార్టీ ప్రచారానికైనా, మీటింగ్ లకు తోలుకుపోవడానికి రోజూ వారీ కూలి ఇవ్వకతప్పడం లేదు.

గ్రామాలు, పట్టణాల్లో మహిళా సంఘాలకు, రోజువారీ కూలీలకు కూలి ఇస్తే తప్ప ప్రచారానికి రావడం లేదు. పొద్దున ప్రచారం చేస్తే రూ.300, సాయంత్రం…