భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
ఇస్రో రికార్డు : ఇస్రో అతిపెద్ద రాకెట్ LVM3-M5 ద్వారా 4,000+ కిలోల బరువున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా GTOలోకి ప్రయోగించింది. దేశీయ గడ్డపై నుంచి చేపట్టిన అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగం ఇది.
RDI నిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ESTIC 2025 సందర్భంగా, పరిశోధన, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి రూ.1 లక్ష కోట్ల RDI నిధిని ప్రారంభించారు.
నౌకాదళ విన్యాసాలు : భారత్, జపాన్ మధ్య ‘JAIMEX-25’ పేరుతో సంయుక్త సముద్ర విన్యాసాలు జరిగాయి.
…

