భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా సినిమా టైటిల్ రిలీజ్ అయింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే విభిన్నమైన టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ద్వారా సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో రవితేజ సరసన ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వారి పాత్రలు కథకు కొత్త రంగును తెస్తాయని సమాచారం.…


