భారత్ సమాచార్.నెట్: జమ్మూకశ్మీర్‌లోని (Jammu &Kashmir) పహల్గామ్‌లో (Pahalgam) ఈ నెల 22న పర్యాటకులపై (Tourists) ఉగ్రవాదులు (Terrorists) విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 28 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిని తామే చేశామని పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం భారత్ (India) సహా ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమాయక ప్రజలపై చేసిన…