భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి దేవాలయాల నిర్మాణాలు ఎంతగానో తోడ్పడతాయని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో నూతనంగా నిర్మించిన 42 అడుగుల భారీ పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, నియోజకవర్గంలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గద్దె సుష్మా గణేష్,…

