భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వలిగొండ ఎస్సై ఎ.శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు.
తనిఖీల సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులను గుర్తించి జరిమానాలు విధించారు. అలాగే చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న యజమానులపై కూడా…





