భారత్ సమాచార్.నెట్, నల్గొండ: నెంబర్ ప్లేట్లు లేకుండా, సరైన ధృవపత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలను నియంత్రించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా, త్రిపురారం మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నెంబర్ ప్లేట్లు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కైగురి నరేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై వాహన చోదకులకు పలు సూచనలు చేశారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సరైన నెంబర్ ప్లేట్లు అమర్చాలని, సంబంధిత ధృవపత్రాలను…





