భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండలం వెల్కటూర్ గ్రామ శివారులో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండటంతో రైతులు ప్రాణభయంతో వణుకుతున్నారు. రైతు కొడార్ముర్ రవికి చెందిన వ్యవసాయ భూమిలో విద్యుత్ తీగలు మనిషికి తగిలేంత తక్కువ ఎత్తులో ఉండటంతో పొలం పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. చివరకు ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ప్రమాదాన్ని పసిగట్టి దుక్కి దున్నేందుకు నిరాకరిస్తూ వెనుదిరుగుతున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై స్థానిక విద్యుత్తు సిబ్బందికి, మండల అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ‘వీలున్నప్పుడు చూస్తాం’ అంటూ నిర్లక్ష్యంగా…
ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాల్లోకి..

