భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ పరిధిలోని ఎస్సీ కాలనీలో గత పది నెలలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కాలనీలోని బోరు బావి పాడైపోయి, రిపేరుకు నోచుకోకపోవడంతో స్థానికులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు తక్షణమే స్పందించారు. తన సొంత చొరవతో సంబంధిత బోరు మోటారు, స్టార్టర్‌ను రిపేర్ చేయించి, తిరిగి బిగించారు. బోరు మరమ్మతు పూర్తి కావడంతో నీరు సమృద్ధిగా వస్తుండటంతో…
బోరు మరమ్మతుతో తీరిన నీటి కష్టాలు

