భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మన శరీరంలో కనిపించే చర్మరంగు మార్పులు కొన్నిసార్లు కేవలం సౌందర్య విషయం కాకుండా ఆరోగ్యపరమైన సంకేతం కూడా కావచ్చు. వాటిలో ఒకటి “అకాంథోసిస్ నైగ్రికన్స్ (Acanthosis Nigricans)” అనే చర్మ వ్యాధి.

ఏమిటి అకాంథోసిస్ నైగ్రికన్స్..?

ఇది ఒక చర్మ సంబంధిత పరిస్థితి, ఇందులో చర్మం కొన్ని ప్రాంతాలలో ముదురు గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతుంది. ఆ ప్రాంతం మందంగా, దళసరిగా, మృదువుగా ఉంటుంది. ఇది సాధారణంగా మెడ వెనుక భాగం, చేతుల చుట్టు భాగాలు (సంకలు), గజ్జల…