భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అర్వపల్లి మండలం కూచమర్తి గ్రామంలో గురువారం శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక యువతులు, మహిళలు పెద్దసంఖ్యలో గణనాథుడి చెంత కోలాటాలతో ఆడిపాడారు. కార్యక్రమంలో శ్రీ సిద్ది వినాయక్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.