భారత్ సమాచార్.నెట్, మహబూబ్నగర్ జిల్లా : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. స్థానిక బాలుర కళాశాల మైదానంలో సుప్రభాత్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో సీనియర్ సిటిజన్స్ పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వృద్ధ మహిళలు రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మల చుట్టూ చేరి, సాంప్రదాయ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు.
తెలంగాణ ఆత్మీయతను ప్రతిబింబించే ఈ వేడుకల్లో…





