September 4, 2025 12:31 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

శాంతియుతంగా వినాయక నిమజ్జనం పూర్తిచేయాలి

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: గణేష్ నిమజ్జనం, శోభాయాత్రలను సాంస్కృతిక కార్యక్రమాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా మన జిల్లాలోని పట్టణాలలో, గ్రామాలలో అనేక గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకున్నారని, వినాయక చవితి పర్వదినంలోని చివరి ఘట్టం నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. సంస్కృతి సంప్రదాయాలను జాతీయ సమైఖ్యతను చాటి చెప్పే విధంగా ముగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కావున వినాయక ఉత్సవ సమితి సభ్యులు తీర్మానించిన సమయంలో 6వ రోజు, 10వ రోజుల్లో మాత్రమే తప్పనిసరిగా నిమజ్జనం చేయాలని సూచించారు. వినాయకుల శోభాయాత్రరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించి భక్తితో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శిస్తూ భక్తులు వీక్షించే విధంగా క్రమశిక్షణతో రాజీవ్ చౌక్ చేరుకొని ప్రతి అడుగు భక్తి శ్రద్ధలతో వేస్తూ, ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తూ సాధారణ పౌరులకు, ప్రజలకు ఏ వర్గానికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. అతి ధ్వనులైన డీజే సౌండ్స్ ఉపయోగించకుండా ఆకతాయి చేష్టలు లేకుండా సంప్రదాయబద్ధంగా భజనలు, డోలు సన్నాయిలతో, మేళాతాళాలు, డప్పు వాయిద్యాలతో, కోలాటాలతో శోభాయాత్ర నిర్వహించుకోవాలన్నారు.

Share This Post