భారత్ సమాచార్, హైద్రాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైద్రాబాద్ వాసి మృతి చెందాడు. అమెరికాలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు హైదరాబాదీ యువకుల మృతి ఆందోళనను కలిగిస్తుంది. షికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చంచల్‌గూడ వాసి షెరాజ్ మృతి చెందాడు. అదేవిధంగా డల్లాస్‌లో జరిగిన కాల్పుల్లో మీర్‌పేటకు చెందిన చంద్రశేఖర్ దుర్మరణం చెందాడు. కుమారులను కోల్పోయిన ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు తల్లిదండ్రులు ప్రభుత్వ సహాయం కోరతున్నారు.
మరిన్ని కథనాలు:





